ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. రేపు సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2021 డిసెంబర్ లో ప్రారంభమై 2024 డిసెంబర్ లో పూర్తి అయ్యింది ఈ ఫ్లై ఓవర్. 799 కోట్ల వ్యయం తో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్.. తెలంగాణ ఏర్పడ్డాక నిర్మించిన అతి పెద్ద ఫ్లై ఓవర్ గా గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన పీవీ ఎస్ప్రేస్ తో పోల్చితే.. హైదరాబాద్ లో రెండవ అతిపెద్ద ఫ్లై ఓవర్ ఇదే.
మొత్తం 4.08 కిలో మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పు తో మొదటి సారి నిర్మించిన 6 లైన్ల ఫ్లై ఓవర్ ఇది. అయితే ఈ ఫ్లై ఓవర్ రాకతో.. పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రయాణం సులభతరం కానుంది. మహబూబ్ నగర్, బెంగుళూర్, కర్నూల్, అనంతపురం వెళ్లే వారికి ఈ ఫ్లై ఓవర్ పై ప్రయాణం ద్వారా ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.