విడుదలకు ముందే ట్రోల్స్ ఎదుర్కొంటున్న విజయ్ వారసుడు.. ఏమైందంటే..?

-

సంక్రాంతికి పోటీ పడుతున్న పెద్ద సినిమాలలో మరో పెద్ద సినిమా విజయ్ వారసుడు.. ఈ సినిమా నుంచి నిన్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయగా.. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాలీవుడ్ హిట్ సినిమాల పైన పలు సినిమాలను మిక్స్ చేస్తే వారసుడు ట్రైలర్ లా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ మూవీ అంచనాలను అందుకోవడం లేదనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసింది..

ఇదిలా ఉండగా దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ తో తెరకెక్కించిన మహర్షి సినిమా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే . ఈ సినిమాకి కొన్ని మార్పులు చేసి వారసుడు సినిమాని తెరకెక్కించినట్లు ఉన్నారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.అంతేకాదు వారసుడు సినిమా ట్రైలర్ సరైనోడు, బ్రహ్మోత్సవం, అలవైకుంఠపురంలో సినిమాలను గుర్తు చేసేలా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లోని కొన్ని షాట్స్ అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలను గుర్తు చేస్తున్నాయి . ఒకవేళ ఈ సినిమా తమిళంలో హిట్ అయినా తెలుగులో ప్రేక్షకులను మెప్పించడం కష్టం అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరొకవైపు బీస్ట్ సినిమాతో డిజాస్టర్ పాలైన విజయ్ వారసుడు సినిమాతో కచ్చితంగా సక్సెస్ సొంతం చేసుకోవాల్సి ఉంది. అంతేకాదు వారసుడు సినిమా కోసం దిల్ రాజు ఊహించని స్థాయిలో ఖర్చు పెడుతున్నారు.విజయ్ కూడా ఈ సినిమాతో తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడు . ఇలాంటి సమయంలో ఇలాంటి ట్రోల్స్ వస్తూ ఉండడం నిజంగా సినిమాపై నెగటివిటీ నీ స్ప్రెడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version