రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సుమారు 25పై మియాపూర్ , పంజాగుట్ట పోలీసులు కేసు పైల్ చేసిన విషయం తెలిసిందే. కేసులు నమోదైన వారిలో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి పోలీసులు నోటీసులు పంపారు.
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.సెలబ్రిటీలు బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. మార్కెట్‌లో అన్ని వస్తువులను ప్రమోట్ చేసినట్లుగానే బెట్టింగ్ యాప్స్‌ను వారు ప్రమోట్ చేశారన్నారు. బెట్టింగ్ యాప్స్ నిషేధానికి ఒక చట్టం ఉంటే.. ఆ చట్టం ప్రకారంగానే అందరూ సెలబ్రిటీలు నడుచుకుంటారని కామెంట్ చేశారు. ఓ వస్తువు చెడిపోతే దాన్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసు వేస్తారా? లేక కంపెనీపై వేస్తారా? అని ఆర్జీవీ ప్రశ్నించారు.