తెలుగు వాళ్లు ఉన్నంత కాలం టీడీపీ పార్టీ ఉంటుందన్నారు చంద్రబాబు. ఈ పార్టీకి నాతో సహా మనమంతా వారసులమే అంటూ వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను ఈ పార్టీకి కేవలం ఒక అధ్యక్షుడిని మాత్రమేనని… తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలన్నదే నా ఆలోచన అన్నారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు.ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఆనాడు తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం కోసం మహనీయుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే టీడీపీ అని గుర్తుచేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిందని.. అది అషామాషీ విషయం కాదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేసి ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.