ఓటిటిలోకి వచ్చేసింది “భైరవం” సినిమా.. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం. ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ రిలీజ్ అయింది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవం సినిమా జూలై 18న తెలుగు, హిందీ భాషలలో ZEE5 లోకి అందుబాటులోకి రానుంది.

మే 30న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముగ్గురు హీరోల అద్భుతమైన నటనకి అభిమానులు ఫిదా అయ్యారు. భైరవం సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా పనిచేశారు.