పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీంతో రానున్న రెండు రోజులలో అల్పపీడనం జార్ఖండ్, చత్తీస్గడ్ వైపు కదులుతోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో కూడా మరో మూడు రోజులపాటు అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురవగా…. మరికొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలియజేశారు.