Bhola Shankar: బోళా శంకర్ నుండి “జజ్జనక” సాంగ్ రిలీజ్

-

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మ సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి మహతీశ్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క” అంటూ సాగే సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్ లో సాంప్రదాయ దుస్తులు ధరించి తనదైన శైలిలో హుషారైన నృత్యాలతో ఆకట్టుకున్నాడు మెగాస్టార్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version