అలా చేసి మళ్లీ పరువు పోగొట్టుకోబోతున్న భోళాశంకర్..!

-

ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా , తమన్నా హీరోయిన్ గా , కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించిన చిత్రం భోళా శంకర్. ఆగస్టు 11వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమాకి ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేశారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ సినిమా దాదాపు పరువు పోగొట్టుకుందనే చెప్పాలి. ఇప్పుడు మరొకసారి ఉన్న పరువును కాస్త పోగొట్టుకోవడానికి హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదలయ్యింది. ఇది చూసిన నెటిజన్ లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా భోళాశంకర్ పేరుతోనే ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిందీలో చిరంజీవికి జాకీష్రాఫ్ డబ్బింగ్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా అయ్యుండి తెలుగు ప్రేక్షకులనే మెప్పించలేదు.. ఇక హిందీ ప్రేక్షకులను ఏమ్ మెప్పిస్తుంది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇకపోతే తెలుగులో ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. మూడు రోజులకు గాను ఏపీ + తెలంగాణలో రూ.21.68 కోట్ల షేర్ తో పాటు, రూ.32.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ .25.36 కోట్ల షేర్ రాగా.. రూ.40 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే దాదాపు రూ.80.50 కోట్ల రేంజ్ షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం ఇంతే కలెక్షన్లు సాధించింది. ఇంకా రూ .55 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది.మరీ ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version