పెద్ద హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి: ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ

-

ఈ డిజిటల్ యుగంలో ఓటీటిల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్ తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల గ్యాప్ లోనే ఓటీటీ లోకి రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని సినిమాలు డైరెక్టుగా ఓటీటీ లోనే విడుదలవుతున్నాయి. తెలుగు ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో రేపు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్స్ అత్యవసర సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ..

ఓటిటితో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు దీనావస్థలో ఉన్నారని అన్నారు. 30% మించి హాల్స్ ఫుల్ కావడం లేదు అన్నారు. ఓటిటి ఫ్రీ సినిమాలతో ఎవరు సినిమా థియేటర్ లోకి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఓటీటి వైపే మగ్గుచూపుతున్నారని, తెలుగు సినీ రంగ పరిస్థితి అధ్వానంగా తయారైంది అన్నారు. అందరూ కలిసి సినీ రంగాన్ని చేతులారా పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని అన్నారు రమేష్. సినిమా విడుదలైన పది వారాల తరువాతే ఓటీటీ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version