అందుకే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను: మాజీ ఎస్ఆర్ రామచంద్రు

-

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాధించిందన్నారు మాజీ ఎస్ఆర్ రామచంద్రు తేజావత్. రాజ నీతిజ్ఞుడిగా భావించే కేసీఆర్ ఆదివాసి అభ్యర్థిత్వం పై ఆలోచించాల్సిందన్నారు.ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని కేసీఆర్ కు సూచించానని అన్నారు.కానీ, పార్టీ అధ్యక్షుడిగా ఆయన నా సలహాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.ఏపార్టీ లో చేరాలన్న అంశంపై ఇంకా ఆలోచన చేయలేదన్నారు.

భవిష్యత్ లో ఈ అంశంపై ఆలోచిస్తాననీ అన్నారు రామచంద్రు.టీఆర్ఎస్ పార్టీకి చాలా చేసాననీ..ఢిల్లీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా(ఎస్సార్) అనేక ప్రాజెక్ట్ లకు అనుమతులు తీసుకువచ్చానని అన్నారు.తొలిసారి ఆదివాసి గవర్నర్ గా ముర్ము సేవలందించారనీ..అలాగే, తొలి ఆదివాసి, మహిళా రాష్ట్ర పతిగా దేశానికి సేవలందించబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఆదివాసి రాష్ట్రపతి కలగానే మిగిలేదన్నారు.దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసామని తెలియజేశారు.తెలంగాణ ప్రజలు, దేశ వ్యాప్తంగా ఆదివాసిల తరపున శుభాకాంక్షలు తెలిపానని అన్నారు.ముర్మును రాష్ట్రపతి అభ్యర్థి గా నిలిపిన ప్రధాని మోడి కి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version