బిగ్‌బాస్ 4: ఇంటి స‌భ్యుల‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన బిగ్‌బాస్‌

-

ప‌ద‌వ వారంలోకి బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంట‌రైంది. అయినా ఇంటి స‌భ్యుల్లో మార్పు రావ‌డం లేద‌ని గేమ్ ప‌ట్ల సీరియ‌స్ నెస్ లేద‌ని బిగ్‌బాస్ సీరియ‌స్ అవుతున్నాడు. ఈ రోజు ఇంటి స‌భ్యుల‌కు బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ `ఆఖ‌రి బంతి`. ఇందులో కెప్టెన్సీ టాస్క్‌లో గెల‌వాలంటే ఒక స‌భ్యుడి ఫొటో వున్న బంతిని మ‌రో స‌భ్యుడు గోల్‌లో వేయాల్సి వుంటుంది. ఇది ఫిజిక‌ల్ టాస్క్‌.

ఈ టాస్క్‌లో అభిజిత్ బంతిని హారిక‌.. హారిక బంతిని అభిజిత్ గోల్‌లో వేసే ప్ర‌య‌త్నం చేశాడు. మైండ్ గేమ్‌తో ఆడినా అఖిల్‌, సోహైల్‌, మోహ‌బూబ్ ఒక్క‌టి కావ‌డంతో మ‌ధ్య‌లోనే ఆట నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. తొలి రౌండ్‌లో లాస్య‌.. ఆ త‌రువాత రౌండ్‌లో అవినాష్‌.. త‌రువాత అరియానా.. మోనాల్.. హారిక ఆట నుంచి త‌ప్పుకున్నారు. చివ‌రికి ఈ గేమ్‌లో అఖిల్‌, సోహైల్‌, మోహ‌బూబ్ మిగిలారు. అయితే ఈ గేమ్ నుంచి అఖిల్‌, మెహ‌బూబ్‌ల కోసం సోహైల్ త‌ప్పుకోవ‌డంతో ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు కెప్టెన్ అవుతార‌ని అంతా భావించారు కానీ ఇక్క‌డే మెహ‌బూబ్ ట్విస్టిచ్చాడు.

నామినేష‌న్‌లో వున్నాను కాబ‌ట్టి ఈ ద‌ఫా కెప్టెన్సీ త‌న‌కే వ‌దిలేయాల‌ని మెహ‌బూబ్ అన‌డంతో లేదు ఈ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ అని అఖిల్ వాదించాడు. దీంతో విసుగెత్తిన బిగ్‌బాస్ ప‌ద‌వ‌వారంలోకి న‌డుస్తున్నా ఇంటి స‌భ్యుల్లె ఎవ‌రికీ టాస్క్ ప‌ట్ల సీరియ‌స్ నెస్ లేద‌ని గేమ్‌ని ర‌ద్దు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు. దీంతో అఖిల్‌, సోహైల్‌, మోహ‌బూబ్ల మ‌ధ్య అస‌లు ర‌చ్చ మొద‌లైంది. అఖిల్ ఫ్ర‌స్టేట్ అయిపోయాడు. ఇక్క‌డ ఫ‌్రెండ్షిప్ అనేది బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డాడు. ఆ త‌రువాత సోహైల్‌తోనూ అదే ర‌చ్చ న‌డిచింది. మోనాల్ కార‌ణంగా మ‌ళ్లీ ముగ్గురు ఒక్క‌ట‌య్యారు.

నామినేష‌న్ విష‌యంలో సోహైల్‌, మోనాల్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర టాపిక్ న‌డిచింది. నామినేష‌న్‌లో అఖిల్ వుంటే నువ్వు అఖిల్‌నే సేవ్ చేస్తావ్ అన‌గా రేపు పొద్దున నువ్వా నేనా అనే ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు నిన్నే అఖిల్ సేవ్ చేస్తాడ‌ని మోనాల్ చెప్ప‌డంతో సోహైల్ కి సౌండ్ లేదు. ఇదిలా వుంటే ఇంటి స‌భ్యుల‌కు బిగ్‌బాస్ వున్న‌ట్టుండి దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. ఇంటి స‌భ్యులు స్టోర్ రూమ్‌లో వున్న ల‌గేజ్ మొత్తం స‌ర్దేసుకొమ్మ‌ని చెప్పి అంతా సిద్ద‌మై లాన్‌లోకి వ‌చ్చాక ఎవ‌రైతే మీకు గ్రాండ్ ఫినాలేకు అడ్డుగా వున్నారో వారిని నామినేట్ చేయ‌మ‌ని చెప్ప‌డంతో ఇంటి స‌భ్యులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version