Bigg Boss 5 Telugu: ఏంట్రా ష‌న్ను.. ఏంటీ నీ ర‌చ్చ‌..! ఇలా అయితే.. రెడ్ కార్డే అంటున్న నెటిజ‌న్లు

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు రోజులు గ‌డుస్తున్న కొద్ది ఆట ర‌స‌వ‌త్త‌రంగా , రంజుగా సాగుతుంది. ఆట‌మొదలై అప్పుడే 5 వారాలు అవుతుంది. టైటిల్ పోరులో ఎవ‌రూ ఎవ్వ‌రికి త‌గ్గువేం కాదు. కంటెంట్ ఇవ్వడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధమే. ఇంటి స‌భ్యులంద‌రూ దేశముదుర్లే.
తొలుత ఓ కంటెస్టెంట్ పై అంద‌రికీ చాలా సాప్ట్ కార్న‌ర్ ఉంటే.. చాలా సీరియ‌ల్స్‌.. చిన్నోడు.. కాస్త అమాయకంగా ఉంటాడు. వీడు ఈ ముదుర్ల మ‌ధ్య ఏలా నెగులు తాడో ఫాఫం అని బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలా ఫీల‌య్యారు.


కానీ.. మ‌నోడి అస‌లు రంగు ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుంది. బ‌య‌ట అమాయ‌కంగా, స్వాతి ముత్యంలా క‌నిపించినా, లోప‌ల మాత్రం.. మంచి క‌సిమీద అర్జున్ రెడ్డి ఉన్నాడు. అత‌డో ఎవ‌రో కాదు. సిరి శిష్యుడు.. జేస్సీ ఫాలోవ‌ర్ .. అత‌డే షణ్ముఖ్ జస్వంత్( ష‌న్ను). తొలి మూడు వారాలు అస‌లు హౌస్‌లో ఉన్నాడా లేదా అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తించాడు. కానీ.. ష‌న్నును ఏకంగా 8 మంది నామినేట్ చేస్తే.. తెలుస్తుంది. మ‌నోడు ఎలాంటి వాడో అర్థమ‌వుతుంది.

గ‌త రెండు రోజుల నుంచి మ‌న్నోడు చాలా తేడాగా క‌నిపిస్తున్నాడు. గొడవలకు చాలా దూరంగా ఉండే ష‌న్ను.. కావాల‌ని గొడ‌వ‌ల‌కు దిగుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. అస‌లు ఏం జ‌రిగిందో తెలియ‌కుండా .. జెస్సి విషయంలో ఇంటి కెప్టెన్ శ్రీరాంతో గొడవ పడ్డాడు. త‌న త‌ప్పు అని తెలిసిన లైట్ తీసుకున్నాడు. కానీ ఆ ఫేస్ లో ప్ర‌శ్చాతపం కనిపించ‌డం లేదు. ఇప్పటి నుంచి ఇంట్లో అందరితో ఇలాగే ఉంటాను. నా గేమ్ ఎలా ఉంటుందో చూపిస్తా.. అంటూ కాస్త వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. జెస్సీ, సిరిల ఆట‌ను కూడా త‌నే ఆడుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. వారిద్ద‌రిని మిస్ యూస్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది.

మ‌రోవైపు.. ష‌న్నుపై ట్రోలింగ్ కూడా మొదలైంది. మొదటి వారం నుంచి ఇలాగే ఆడుంటే.. ఇన్ని నామినేషన్స్ పడవు కదా అంటూ యూ ట్యూబ్ కుర్రాడిపై కామెడీ చేస్తున్నారు. ఒక్కసారి నామినేట్ అయితే.. ఇలా బిహేవ్ చేయ‌డ‌మేంటి ష‌న్ను అంటు కామెంట్లు చేస్తున్నారు. ష‌న్ను ఆట తీరు ఇలానే కొన‌సాగితే.. రెడ్ కార్డు వ‌ర‌కు వెళ్తుందంటూ వార్నింగులు వస్తున్నాయి. రెడ్ కార్డ్ అంటే ప్రేక్షకుల ప్ర‌మేయం లేకుండా హోస్ట్ తనకున్న అధికారంతో రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేయడం అన్నమాట.

ష‌న్ను బిహేవియ‌ర్ చూస్తే మాత్రం ఈ సారి వీకెండ్‌లో నాగార్జునతో కచ్చితంగా అక్షింతలు ప‌డేట్టు ఉన్నాయి. ఏదేమైనా తొలిసారి నామినేషన్స్‌లోకి రావడంతో.. చాలా వింతగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు ల‌వ‌ర్ బాయ్ ష‌న్ను. బీ కేర్ ష‌న్ను అంటున్నారు నెటిజ‌న్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version