Big boss 6: బిగ్ బాస్ 6 విజేత రేవంత్..!

-

ఎట్టకేలకు సింగర్ రేవంత్ అనుకున్నది సాధించారు అని చెప్పాలి. ఆయన అనుకున్న కల నెరవేరుతూ ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ విజేతగా నిలబెట్టింది. ఈ సీజన్ మొదలైన కొన్ని వారాలకే రేవంత్ విన్నర్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. మొదటినుంచి ఓటింగ్లో టాప్ లో ఉన్న రేవంత్ విన్నర్ ని ప్రకటించడానికి ముందు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.. ఎంత చక్కగా బిగ్ బాస్ లో పర్ఫామెన్స్ చేశారో చెబుతూ ఆయన జర్నీని చూపించారు. మొత్తం ఈ సీజన్ లోని మంచి మూమెంట్లను కూడా వేశారు. ఇకపోతే మాజీ కంటెంట్లను ఎవరు గెలుస్తారో ఊహించి చెప్పమని అడగగా.. పదిమంది శ్రీహాన్ అని చెప్పగా.. 9 మంది రేవంత్ గెలవాలని చెప్పారు.

ఇంట్లోకి గోల్డెన్ సూట్ కేస్ తో వెళ్లిన నాగార్జున ఈ సూట్ కేసులో రూ. 25 లక్షలు ఉంది.. ఆలోచించి ఈ మొత్తాన్ని తీసుకొని ఇంట్లోంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మిగిలిన వ్యక్తి విన్నర్ అవుతారని.. అతనికి ట్రోఫీ, మిగిలిన డబ్బు అందుతుందని చెప్పారు. అయినా రేవంత్ , శ్రీహన్ టెంప్ట్ అవలేదు. నాగార్జున చాలా కన్వీస్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇద్దరు కూడా ట్రోఫీ మాత్రమే కావాలని చెప్పారు. తర్వాత సూట్ కేస్ మొత్తాన్ని 30 లక్షల రూపాయలకు పెంచారు అయినా కూడా వారు ఒప్పుకోలేదు.

శ్రీహాన్ తీసుకోవాలని మాజీ కంటెస్టెంట్లు చాలా మంది సూచించారు. ఫైనల్ గా వారిద్దరిని వేదిక పైకి తీసుకొచ్చిన నాగార్జున సూట్ కేసులో మొత్తాన్ని రూ.40 లక్షలకు పెంచాడు . అప్పుడు శ్రీహన్ తండ్రి తీసుకోమని కొడుకుకు చెప్పడంతో ఆయన 40 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇక తర్వాత రేవంత్ ను విన్నర్గా ప్రకటించారు బిగ్బాస్. కొడుకు విజేతగా మారడం చూసి తల్లి సీత సుబ్బలక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version