Bigboss7: రైతు బిడ్డకు తప్పని తిప్పలు.. ఉంటాడా? ఊడతాడా..?

-

Bigboss7: తాజాగా బిగ్ బాస్ 7 లోకి రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ను ఇప్పుడు అందరూ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటివారం ఎలిమినేషన్స్ లో భాగంగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. ఇక రెండవ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగానే సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక బాక్స్ గీసి అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ని నిలబెట్టారు. వారి పైన షవర్ కూడా ఉంది. అయితే ఎవరెవరు వారిని నామినేట్ చేయాలనుకుంటున్నారో బజర్ నొక్కితే వారి పైన కలర్ వాటర్ పడతాయి.

ఆ తర్వాత కారణం చెప్పాల్సి ఉంటుంది. బాక్స్ లోకి రాగా ఏకంగా 6 మంది కంటెస్టెంట్లు అతడిని నామినేట్ చేశారు. గౌతమ్, షకీలా, తేజ, అమర్దీప్ , ప్రియాంక, దామిని ఇలా ఏకంగా ఆరుగురు నామినేట్ చేయడంతో ప్రశాంత్ వీరితో గొడవ పెట్టుకున్నాడు. బయట కూడా ప్రశాంత్ కి ఫుల్ నెగెటివిటీ ఉంది. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ అతడు ఎదగడం కోసం రైతుల పేరును వాడుకొని మోసం చేస్తున్నాడనే కామెంట్లు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. మరొకవైపు బిగ్ బాస్ కి అడుక్కొని వచ్చాడని అందరూ అంటూనే ఉన్నారు.

ఇవే కామెంట్స్ హౌస్ లో వాళ్లు కూడా అనడంతో ప్రశాంత్ కి ఏం చేయాలో తెలియట్లేదు. సెంటిమెంటుతో నటిస్తున్నాడని.. ఇన్ని రోజులు రతికాతో పులిహోర కలుపుతూ కూర్చోగా ఇప్పుడు రతిక కూడా ప్రశాంత్ కి కౌంటర్లు వేయడంతో అతడు షాక్ అయ్యాడు. ఇక తనకు గుర్తింపు రావడం కోసమే ఇలా బిగ్ బాస్ లోకి వచ్చాడని, అతడు రైతుబిడ్డ కాదు ఒక ఫేక్ అంటూ చాలామంది నిందిస్తున్నారు. మరి ఈ వారం రైతుబిడ్డ కల మధ్యలోనే ఆగిపోతుంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వారం ప్రశాంత్ ఎలిమినేట్ అవుతాడా? లేదా? తెలియాలి అంటే శనివారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version