Big boss 6: వీకెండ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లపై చెలరేగిన నాగార్జున.. కారణం..?

-

ప్రస్తుతం రెండవ వారం జరుపుకుంటున్న బిగ్ బాస్.. శనివారం నాగార్జున హౌస్ మేట్స్ పై పూర్తిస్థాయిలో రెచ్చిపోయారు. మొదటినుంచి హౌస్ మేట్స్ ని పలకరించేటప్పుడే సీరియస్ గా ఉండడంతో హౌస్మెట్స్ ముఖాలు కూడా మాడిపోయాయి. ఆ తర్వాత తొమ్మిది మంది పేర్లు చదివి వారిని సోఫా వెనక్కి వెళ్లి నిలబడమని చెప్పాడు. అంతే కాదు వాళ్ళ లగేజ్ కూడా ప్యాక్ చేసేయమని చెప్పగానే.. హౌస్ మేట్స్ గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఆ తర్వాత సోఫాలో కూర్చున్న 11 మందికి కూడా క్లాస్ పీకుతూనే వాళ్ళ గేంలో జరిగిన తప్పులను తెలియజేశాడు. ముఖ్యంగా ఫైమా , చంటి గేమ్ల గురించి క్లాస్ పీకాడు నాగార్జున. అలాగే ఆర్జే సూర్య పై ఇంట్లో చిల్ అవ్వడానికి వచ్చావా అంటూ ఫైర్ అయ్యారు.

అంతేకాదు ఆరోహి, అర్జున్ కళ్యాణ్ కి కూడా గట్టిగా క్లాస్ పడింది . అర్జున్ కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే నువ్వు సోఫాలో ఉంటావా వెనక్కి వెళ్తావా అంటూ కూడా కౌంటర్ వేశాడు. టాస్క్ లో ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు అనేది వాళ్లకి అర్థం అయ్యేలా తెలియజేశారు. మొత్తం ఎపిసోడ్ సీరియస్ గానే హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతూనే ఉన్నాడు కింగ్ నాగార్జున..ఇక అంతేకాదు సోఫాలో కూర్చున్న 11 మందిని వెనుక ఉన్న 9 మంది హౌస్ మేట్స్ లో వేస్ట్ ఎవరో చెబితే వాళ్లని ఎలిమినేట్ చేస్తానని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా అనడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక చేసేదిలేక ఒక్కొక్కరు ఒక్కో పాటిస్పేట్ ని వేస్ట్ అంటూ స్టాంప్స్ వేశారు . ఇందులో శ్రీ సత్య, వాసంతి , షానీలకు ఎక్కువగా ఓట్లు వచ్చాయి.

ముఖ్యంగా ఆడియన్స్ ఓటింగ్ , హౌస్ మేట్స్ ఓటింగ్ సమానంగా అయిన వాళ్ళని పంపించేస్తానంటూ షానీ పేరు చెప్పి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు నాగార్జున. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు కాబట్టి అభినయ శ్రీ కూడా ఎలిమినేట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version