BIGG BOSS 7: నామినేషన్ ప్రక్రియలో “భోలే” తీరు మారదా…!

-

బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా అంతా ఉల్టా పల్టా గా సాగుతోంది. గత సీజన్ లలో లాగా కాకుండా మొత్తం ఇంటి సభ్యులు కూడా చాలా వైవిధ్యంగా ఆటను ఆడుతున్నారు. ఎవరైనా నేను ఇంట్లో ఉండాలి,, బాగా ఆడి ఓట్లు సంపాదించుకుని టైటిల్ ను గెలుచుకోవాలి అని అనుకుంటారు, కానీ ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఒక్క కంటెస్టెంట్ మాత్రం నేను ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండి వెలుతాను అంటున్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ లో వచ్చిన సంగీత దర్శకుడు భోలే అనే వ్యక్తి చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ ప్రేక్షకులను సైతం తికమకపెడుతున్నాడు. ఇక నామినేషన్ సమయంలో అతను ప్రవర్తన పట్ల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నామినేషన్ చేసే వ్యక్తి చెప్పే పాయింట్లు సరిగా వినకుండా వారిని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు భోలే. అవతలి వ్యక్తి కనుక పాజిటివ్ గా తీసుకుంటే సరే.. లేదంటే గొడవ… వాగ్వాదం… బూతులు వచ్చేస్తాయి.

ఇక ఎప్పటికి మారుతాడా ఈ భోలే అంటూ ప్రేక్షకులు చాలా బాధపడుతున్నారు. ఈ వారం నామినేషన్లో ఉన్న భోలెను సరాసరి ఇంటికి పంపించేసి ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version