బిగ్ బాస్: ఆరోహి ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే..?

-

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో ఆరోహి కూడా ఒకరు. ముఖ్యంగా ఈమె ఆర్ జె సూర్యాతో లవ్ ట్రాక్ నడిపినట్లు బిగ్ బాస్ టీం ఎడిట్ చేసి మరీ చూపించారు. దీంతో వీరి జంట చాలా అద్భుతంగా ఉందని అందరూ కూడా వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. నిజానికి అందరూ కూడా కొన్ని వారాలపాటు ఆరోహీ బిగ్ బాస్ హౌస్ లోనే కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమె నాలుగవ వారమే ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఆరోహి ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది వారిని ఉంచి ఆరోహి ని ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటూ బయట నుంచి నేటిజన్ లు కామెంట్ లు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారమే ఆరోహీ ఊహించని విధంగా ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. నిజానికి ఆరోహీ గేమ్ పరంగా ఇటీవల చాలా వెనుకబడింది. ఇక ఆర్జె సూర్య సపోర్టుతో గేమ్లో ముందుకెళ్ళింది . ఒక్కోసారి సోలోగా గేమ్ ఆడినా కూడా సూర్య కోసం త్యాగం చేసింది. దీనితో ఆమె టాస్క్లలో ఎక్కువగా గెలువ లేకపోయింది. అంతేకాదు ఆటలో కంటే కూడా సూర్యతోనే ఎక్కువగా కనిపించింది దీంతో ప్రేక్షకులు ఈమెకు పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు

ఇక రెండవ కారణం సోషల్ మీడియా ద్వారా ఆరోహికి పెద్దగా ఫాలోవర్స్ లేకపోవడమే అతిపెద్ద మైనస్ గా మారిపోయింది. దీని వల్ల ఈమెకు ఓటింగ్ కూడా పెద్దగా రాలేదు. దీంతో డేంజర్ లోకి వెళ్ళిపోయింది ఆరోహి.. ముఖ్యంగా అడవిలో ఆట టాస్క్ లో దొంగల టీం లో ఉన్న ఆరోహి.. రేవంత్ బొమ్మలను మైనస్ గా మారిపోయింది. హౌస్ మేట్స్ లో అందరితో కూడా కలగలసి ఉండలేకపోయింది ఇక అందుకే ఇన్ని మైనస్ పాయింట్స్ మధ్య ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version