బిగ్ బాస్ విన్నర్ కి డబుల్ బొనాంజా.. ప్రైస్ మనీ తో పాటు ల్యాండ్ కూడా..!

-

తాజాగా బిగ్ బాస్ ఆరవ సీజన్ 14వ వారానికి చేరుకుంది. క్రమంలోని బిగ్ బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారు? ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు ? అనే విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఆరవ సీజన్ కి విన్నర్ గా ఎన్నికైన వారికి ప్రైజ్ మనీ తో పాటు ల్యాండ్ కూడా ఇస్తారు అంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 13వ వారం బిగ్బాస్ హౌస్ నుంచి జబర్దస్త్ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ ను వీడింది. ఇదిలా ఉండగా ఫైమా వెళ్లిపోయిన తర్వాత హోస్ట్ నాగార్జున ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.

బిగ్బాస్ సీజన్ సిక్స్ విన్నర్ కి ప్రైజ్ మనీతో పాటు ఖరీదైన ల్యాండ్ కూడా అందచేస్తారని ఇంటి సభ్యులకు తెలిపాడు హోస్ట్ నాగార్జున. అంతేకాదు ఆ ల్యాండ్ ఖరీదు ఎంతో తెలిసి హౌస్ మేట్స్ కి ఆశ కలిగించారు నాగార్జున. ఇకపోతే విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందనేది తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది.. అలా ఇంట్రెస్ట్ ఉండడం .. అటు ఇంటి సభ్యుల నుంచి గెలిచే టైటిల్ విన్నర్ కైనా .. బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల కైనా సర్వసాధారణం. అయితే ఈ సీజన్ సిక్స్ లో మాత్రం అనూహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆరో సీజన్ లో ప్రైజ్ మనీని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంటి సభ్యులకు టాస్కులు ఇస్తూ వారిచేతే ఈ డబ్బులు తగ్గించే ప్లాన్ వేసింది.

నామినేషన్స్ నుంచి బయటపడేందుకు ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా రూ.5 లక్షలు లోపు గరిష్ట అమౌంటును చెక్ పై రాసి వేయాల్సిందిగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అమౌంట్ రాసినా.. రాయకున్నా ప్రైజ్ మనీ నుంచి రూ.ఐదు లక్షల కట్ చేస్తామని కూడా బిగ్బాస్ తెలిపాడు. ఇకపోతే అందరికీ ఇచ్చే ప్రైస్ మనీ లో రూ. 8 లక్షలు తగ్గుతుంది. బిగ్బాస్ విన్నర్ కి ఇచ్చే ప్రైస్ మనీ తో పాటు 605 స్క్వేర్ యార్డ్స్ కల స్థలాన్ని అందిస్తారు. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ కు చెందిన సాకేత్ నుంచి అత్యంత ఖరీదైన ఈ భూమిని బిగ్ బాస్ తెలుగు సీజన్ విన్నర్ కి ఇవ్వనున్నారు. దీని విలువ సుమారుగా రూ.25 లక్షలు అని పోస్ట్ నాగార్జున వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version