కళ్ళతో, హస్కీ వాయిస్ తో మెప్పించిన సిల్క్ స్మిత..!!

-

పాత తరం వారికి ఐటమ్ సాంగ్స్ అందగత్తె సిల్క్ స్మిత  ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. తన పాటల కోసమే చాలా మంది అభిమానులు రిపెటెడ్ గా సినిమాకు వెళ్లే వారు. తన యొక్క హస్కీ వాయిస్, మత్తెక్కించే కళ్ళు, మరియు అందమైన రూపం అప్పట్టి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశాయి. అప్పట్లో తన పాట లేకుండా ఏ సినిమా విడుదల అయ్యేది కాదు. నిర్మాతలు తన డేట్స్ కోసం వెయిట్ చేసి మరీ షూటింగ్ పూర్తి చేసే వారు.

బావ-బావమరిది’లో  ఆమె పాట బావలు సయ్యా సాంగ్ ఇప్పటికీ అదర గొడుతూనే ఉంటుంది. ‘లేడీ జేమ్స్ బాండ్’లోనూ, చిరంజీవి ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సినిమాలలో నటించింది ఒక్క తెలుగు సినిమానే కాకుండా తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత నటించి అదరగొట్టింది. ఏ భాష లో చేసినా తన అందంతో మాయ చేసేది. బతికున్నప్పుడు ఎన్నో డబ్బులు సంపాదించిన సిల్క్ స్మిత, అంతా పోగొట్టుకొని చివరి రోజుల్లొ పేదరికం తో చాలా బాధపడింది.

అందరిని సంతోష పెట్టిన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న  చేసుకున్నారు. ఆమె మరణం అప్పట్లో మీడియాలో సంచలనంగా మారింది. ఆమె మరణించిన విధానం పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.  సిల్క్ స్మిత  జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’ నిర్మించారు. సిల్క్ జయంతి సందర్భంగా 2011 డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పడు రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని కూడా తన రాబోతున్న దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ వాడుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version