Big Boss Ott : ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ..అఖిల్-బిందుల మధ్య చిచ్చు !

-

బిగ్ బాస్ లోకి ముమైత్ ఖాన్.. మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. బుధవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో రీ ఎంట్రీ ఇచ్చేసింది ముమైత్ ఖాన్. మొదట్లో కూడా ఇలాగే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యాక కూడా తిరిగి వచ్చింది. కోర్టు టాస్క్ లో భాగంగా ముమైత్ ఖాన్ కోర్టు జడ్జిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. అఖిల్-బిందుమాధవి ల మధ్య విడాకుల ఇష్యూ అంటూ ఏదో డ్రామా క్రియేట్ చేసి ఇద్దరి మధ్య ఫైటింగ్ పెట్టింది ముమైత్ ఖాన్.

ఈ డ్రామా లో యాంకర్ శివను వకీలు గా మార్చేశారు బిగ్ బాస్. అయితే ముమైత్ ఖాన్ ను ఎందుకు ఎలిమినేట్ చేశారు… మళ్లీ ఎందుకు తీసుకు వస్తున్నారో తెలియడం లేదు. బిగ్బాస్ లెక్కప్రకారం ప్రేక్షకులు ఓట్లు వేయలేదు.. అందుకే పీకే శాం అంటున్నారు.

అలాంటప్పుడు ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన వాళ్లను మళ్లీ హౌస్ లోకి తీసుకుని రావడం ఏంటో మరి. గేమ్ ఆడుతున్న అనుకుంటే ఆమె కంటే బాగా… ఆర్ జె చైతు వాడాడు. అసలు అతని ఎలిమినేషన్ ఎవరూ ఊహించలేదు. అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను అర్ధాంతరంగా ఎలిమినేట్ చేశారు. ఇది తాజాగా ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version