స్టార్ హీరో కొడుకు తో రొమాన్స్ కి సిద్ధమైన బిందు మాధవి..!!

-

బిందు మాధవి.. ఆవకాయ్ బిర్యానీ సినిమా తో ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ తెలుగు ముద్దుగుమ్మ అందం, అభినయంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తెలుగు సినిమాలలో మాత్రం మంచి గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక అక్కడ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న బిందు మాధవి ఇటీవల తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓ టీ టీ రియాలిటీ షో అయినా బిగ్ బాస్ లో పాల్గొని తన చలాకీతనంతో అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లతో పోటాపోటీగా ఆడపులిలా చెలరేగిపోయింది బిందు మాధవి . ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో బాలయ్య , అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ వరించినట్లు సమాచారం. అది కూడా మలయాళం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .ఇక ఆయన కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని తాజాగా బిందు మాధవి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఏకంగా మాలివుడ్ ఇండస్ట్రీలో మోహన్ లాల్ కొడుకు సరసన నటించే అవకాశం రావడంతో ఈ సినిమా గనుక హిట్ అయితే ఇక బిందు మాధవికి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వస్తాయని అందరూ అంటున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు నిజమవుతుందో ఎదురు చూడక తప్పదు. ఇక మరొక విషయం ఏమిటంటే తెలుగు బిగ్ బాస్ షో లో మొదటి లేడీ టైటిల్ విన్నర్ గా బిందు మాధవి రికార్డు సృష్టించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version