Bola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ ప్రీరిలీజ్‌కు సర్వం సిద్ధం

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టయినర్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ తరుణంలోనే.. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘బోలా శంకర్’ ప్రీ రిలీజ్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఇవాళ రాత్రి 7 గంటలకు ఈవెంట్ జరగనుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించగా…కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటించారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రయిలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version