KGBV టీచర్లకు జగన్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచర్లకు ఇటీవల 23% జీతాలు పెంచిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది.
అయితే నిధులు కొరత కారణంగా మూడు నెలలు కోత విధించి, జూలై నుంచి అమలు చేస్తున్నట్టు KGBV కార్యదర్శి మధుసూదన రావు వెల్లడించారు. దీనివల్ల ఒక్కొ ప్రిన్సిపాల్ నెలకు రూ.6,384, టీచర్లు రూ. 5000 చొప్పున నష్టపోనున్నారు.
కాగా, విజయవాడ-మచిలీపట్నం హైవేకు మంచిరోజులు వచ్చాయి. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న దీన్ని ఆరు లేన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. బందరు పోర్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రహదారిపై భారీగా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో DPR కోసం టెండర్ ను NHAI ఖరారు చేసింది. డిసెంబర్ లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.