మహదేవ్ నెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు

-

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌ను ముంబయి పోలీసులు ఆదివారం రోజున అరెస్టు చేశారు. సైబర్‌ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకుంది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

సాహిల్‌కు సిట్‌ 2023 డిసెంబరులోనే సమన్లు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం యాప్‌నకు బ్రాండ్‌ ప్రమోటర్‌గా మాత్రమే పనిచేశానని.. యాప్‌ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్‌ యాప్‌ సహ-యజమానిగా చెబుతున్నారు. సాహిల్‌ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌దారుకు ‘ది లయన్‌ బుక్‌247’తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలింది అని ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్ తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version