నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తుండగా వాటిల్లో ఏది నిజం కాలేదు. బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాల్సి ఉందని అప్పట్లో అన్నారు. కాని అలాంటిదేమి జరుగలేదు. క్రిష్ డైరక్షన్ లో బాలకృష్ణ నటించిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా మోక్షజ్ఞ నటించే ఛాన్స్ ఉందని అన్నారు. అప్పుడు ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.
ఫైనల్ గా క్రిష్ డైరక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పగా 2019 లో అయినా ఆ సినిమా వస్తుందా అన్న డౌట్ కలుగుతుంది. ఇదిలాఉంటే మోక్షజ్ఞ ఎంట్రీపై బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మోక్షజ్ఞ మొదటి సినిమా తన డైరక్షన్ లో మాత్రం ఉండే అవకాశం లేదని చెప్పాడు బోయపాటి శ్రీను. మొదటి సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మాత్రం తాను చేయలేనని చెప్పాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం సంక్రాంతికి రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాతో రాబోతున్న బోయపాటి శ్రీను ఆ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది.