ట్రెండ్ ఇన్: బాయ్‌కాట్ బాలీవుడ్..దేశానికి వ్యతిరేకంగా వారి అడుగులు!

-

ఒకప్పటితో పోల్చితే దేశంలో చాలా మార్పులొచ్చాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ప్రజల్లో, ప్రభుత్వాల్లో మార్పులొచ్చాయి. ఈ క్రమంలోనే సాంకేతికత బాగా పెరిగిపోయింది. అయితే, ఈ టెక్నాలజీని మంచికి, చెడుకు రెండిటికీ ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా వరల్డ్ లో ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. నచ్చకపోతే విమర్శిస్తున్నారు. అలా రకరకాల ట్రెండ్స్ ను మనం గమనించొచ్చు.

సినీ అభిమానులు తమ అభిమాన హీరో అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో డిమాండ్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ ను మించి దూసుకెళ్తున్నాయి. అయితే, బాలీవుడ్ మేకర్స్ కొందరు ఈ విషయం తట్టుకోలేకపోతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

#BoycottBollywood హ్యష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీల ఫొటోలను ట్వీట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఓ ఫొటోలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు ఇద్దరూ..ఓ హిందూ దేవాలయంలో షూస్ వేసుకుని ఉన్నారు. అదే ఫొటోలో రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో బయట కూడా కాలినడకన స్టిల్ ఇచ్చారు. ఈ ఫొటోకు ‘అంతర్ సాఫ్ హై’ అనే క్యాప్షన్ ఇచ్చాడు ఓ నెటిజన్ .

మరో ట్వీట్ లో గతంలో గుట్కాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోనని పేర్కొన్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘విమల్’ యాడ్ లో నటించడం పట్ల విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ లో భారత్ తరఫున ఆడి పతకాలు సాధించాడని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

డ్రగ్ అడిక్ట్స్ గా ఉన్న బాలీవుడ్ స్టార్ కిడ్స్ పైన ఈ మేరకు పోస్టులో విమర్శలు చేశారు. హిందూ సంస్కృతిని తప్పుడు పద్ధతిలో బాలీవుడ్ వారు తమ సినిమాల్లో చూపిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండవుతోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరి వల్లే యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version