రిలీజ్‌ కాకముందే వివాదంలో “లైగర్‌”..కారణం ఇదే !

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ‘లైగర్’ ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ కానున్నారు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ పై ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పేక్ష ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే లైగర్ డెఫినెట్ గా అలరిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్‌ కాకముందే వివాదంలో చిక్కుకుంది. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్.. లాంటి స్టార్ హీరోలు ఈ బాయ్‌కాట్‌కే బలయ్యారు. అయితే ఈ గాలి ఇప్పుడు లైగర్‌ వైపు మళ్లేలా.. కొందరు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా హిందీలో నెపొటిజం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ పై నెపొటిజం కామెంట్స్ కామన్‌గా ఉన్నాయి.

దీనికి స్టార్ కిడ్ అనన్య పాండే కూడా ఓ కారణం అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో హైలెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాదు లైగర్ సినిమాలో.. ‘ఆ… ఫట్’, ‘అకిడి పకిడి..’ పాటల్లోని కొన్ని హిందీ లిరిక్స్‌ను తప్పు పడుతూ.. విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌ లో #BoycottLigerMovie అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా కరణ్‌ జోహార్‌ ఉండటమేనని కారణమని నెటిజన్ల ఫైర్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version