బ్రో: మూవీలో తన క్యారెక్టర్ పై సెటైర్స్ వేసిన మంత్రి అంబటి రాంబాబు.!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన చిత్రం బ్రో.. ఈ సినిమాను జూలై 28న చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలను చేర్చడంతో ఇప్పుడు వైసీపీ అధికారులు పెద్ద ఎత్తున మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ “శ్యాం బాబు” అనే పాత్రను పోషించారు. అయితే ఒక నిమిషం పాటు కనిపించే ఈ క్యారెక్టర్ ఏపి మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ అని చూసిన వాళ్లకు అర్థమవుతుంది.

అయితే గతంలో సంక్రాంతికి అంబటి రాంబాబు బయట రోడ్డు మీద డాన్స్ వేస్తూ కనిపించగా.. అదే డాన్స్, అదే డ్రెస్ వేయించి పృథ్వి తో ఈ సినిమాలో డాన్స్ చేయించారు. అంతేకాదు ఆ క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ డాన్స్ కూడా రాదా అంటూ తిట్టడంతో అంబటి డాన్స్ వీడియో, పృద్వి వీడియో లింక్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. , ఈ మూవీలో శ్యాం బాబుగా అంబటి రాంబాబు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ ప్రచారం అవుతుండగా ఇది అంబటి రాంబాబు వరకు వెళ్లడంతో.. గెలిచినోడిది సంకురాత్రి డాన్స్.. ఓడినోడిది కాళరాత్రి డాన్స్ అంటూ ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

అంతేకాదు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా సినిమాలలో నా క్యారెక్టర్ పెట్టి పవన్ కళ్యాణ్ శునకానందం పొందుతున్నాడు అంటూ కామెంట్లు చేశారు. నేను ప్రొఫెషనల్ డాన్సర్ ని కాదు.. డబ్బులు తీసుకుని డాన్స్ చేయలేదు.. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని డాన్స్ వేస్తారు పవన్ కళ్యాణ్ అంటూ ఈయన కామెంట్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. అంతేకాదు జనసేనకు సింక్ అయ్యేలా కూడా ఒక రెండు సీన్స్ పెట్టడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version