“చౌర్య పాఠం” నుంచి బంపర్ ఆఫర్… ఐపీఎల్ టికెట్స్ ఫ్రీ

-

సినిమా పబ్లిసిటీ రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. అనిల్ రావిపూడి అనే దర్శకుడు సినిమా ప్రమోషన్స్ ను కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు అదే దారిలోకి అందరూ వెళ్తున్నారు. మరికొందరు సినిమా టికెట్స్ ను ఫ్రీగా ఇస్తూ తమ సినిమాను మరింతగా ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా చౌర్య పాఠం అనే సినిమా మేకర్స్ మరో కొత్త ట్రెండ్ కు తెర లేపారు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఐపీఎల్ ట్రెండ్ నడుస్తోంది. దాన్ని పసిగట్టిన మేకర్స్ ఐపీఎల్ టికెట్స్ ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఈనెల 23న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో హైదరాబాద్ సన్రైజర్ జట్టు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ను చూడడానికి చౌర్య పాఠం మేకర్స్ ఐపిఎల్ టికెట్లను ఉచితంగా ఇస్తామని అనౌన్స్ చేశారు. కానీ టికెట్స్ గెలవాలంటే చిన్నపాటి కాంటెస్ట్ నిర్వహించారు. యంగ్ హీరో ఇంద్ర రామ్ నటించిన ఈ సినిమాను ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మించారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది.

 

నిఖిల్ గొల్ల మారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించి అందుకు సంబంధించి మేకర్స్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పినట్లయితే విన్నర్స్ లోని కొందరిని విజేతలుగా ప్రకటిస్తూ వారికి ఐపీఎల్ టికెట్స్ ఇవ్వనున్నారు. ఏదేమైనా సినిమాను ఆడియన్స్ లోకి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని చిత్రాలు ఇలా వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news