బీఆర్ఎస్ రజతోత్సవానికి లగచర్ల మహిళల విరాళం సంతోషంగా ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్ ను కలిసినట్లు వివరించారు. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.
మరోవైపు వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం నివేదిక వెల్లడించింది. పోలీసులు గీత దాటి వ్యవహరించారని పేర్కొంది. గ్రామస్థుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. ఈ ఘటనపై నవంబర్ 18, 2024న లగచర్లకు చెందిన జారుప్ల దేవితో పాటు మరో 11 మంది కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. నిజానిజాలను నిర్ధారించుకోవడానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ప్రజలతో పాటు అరెస్టైన వారి వాంగ్మూలాలు నమోదు చేసింది.