ఇండస్ట్రీ బాగుకోసం సగానికి పారితోషకం తగ్గించుకున్న బన్నీ..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు రామలింగయ్యా గారి వారసుడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్నారు. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్షోభం నెలకొంది. సినిమా బడ్జెట్ లు విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కాక ఆగస్టు ఒకటవ తేదీ నుంచి షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకొని అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే స్టార్ హీరోలతో సమావేశాలు కూడా నిర్వహించారు.

ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్ లు నిలిచిపోతే తాము తీవ్రంగా నష్టపోతామని వాళ్లకు వివరించారు కూడా.. ఇక ఈ విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో అడుగు ముందుకు వేసి అగ్ర హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరిపారు. ఇక ఆయన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలు కూడా తమ పారితోషకాన్ని తగ్గించుకుంటామని హామీ ఇచ్చినట్లు.. ఇక మిగతా హీరోల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యూసర్ గిల్డ్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కూడా తన పారితోషకాన్ని తగ్గించుకుంటానని చెప్పడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. నిజానికి పుష్ప పార్ట్ టు చిత్రానికి కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటాడని సమాచారం.

ఇటీవల అల్లు అర్జున్ 50% పారితోషకం తగ్గించుకుంటానని హామీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ నుంచి పుష్ప టు సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా హీరోలు కూడా తమ పారితోషకాలను తగ్గించుకొని నిర్మాతలకు సహాయపడాలి అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సినిమాల పారితోషకం తగ్గించుకొని లాభాల్లో వాటాలు తీసుకుంటే సరిపోతుంది కదా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version