టాలీవుడ్ ముందు రేవంత్ సర్కార్ కండీషన్స్ పెట్టారు. ఇకపై ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారట రేవంత్ రెడ్డి. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేర్కొందని అంటున్నారు. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలు ఉండాల్సిందేనని తెలిపారట సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు సినిమా పరిశ్రమ ముఖ్యులు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎఫ్ డిసి ఛైర్మన్ దిల్ రాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిరంజీవి చెన్నైలో ఉన్నాడు.. అందుకే సమావేశానికి రాలేకపోయాడని చెబుతున్నారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లతో ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి యాడ్స్ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. సినిమా రిలీజ్ ముందు థియేటర్‌లో ఆ యాడ్స్ ప్లే చేయాలని తెలిపారు. బెనిఫిట్ షోలకు హీరోలు వెళ్లొద్దనే ఆంక్షలు విధించే అవకాశం ఉందని అంటున్నారు.