హనీరోజ్ ను వేధించిన బిజినెస్ మ్యాన్ అరెస్ట్

-

తనను ఓ బిజినెస్ మేన్ వెంబడిస్తూ.. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ ను తాను హాజరయ్యానని.. అప్పటి నుంచి అతను వెంట పడుతూ సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెల్తే అక్కడ ప్రత్యక్ష్యమవుతున్నాడని పేర్కొన్నారు.

అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది హనీరోజ్. తాజాగా హీరోయిన్ హనిరోజ్ ను వేధించిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూర్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వయనాడ్ లో ఆయనను అదుపులోకి తీసుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనిరోజ్ ను కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు చేసారు. దీనిపై హని రోజ్ ఎర్నాకుళం పీఎస్ లో ఫిర్యాదు చేయగా అతడ్ని అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news