Anupama Parameswaran: ఆసక్తికరంగా అనుపమ “బటర్‌ఫ్లై” టీజర్‌..!

-

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ప్రస్తుతం కూడా అనుపమ పరమేశ్వరన్ 18 పేజీస్ , కార్తికేయ టు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇక తాజాగా అనుపమ పరమేశ్వరన్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బటర్ ఫ్లై “.

జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై గంట సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరు, ప్రదీప్ నల్లమిల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం రోజున ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఎప్పటిలాగే తన పర్ఫార్మెన్స్ ను కనులారా చూపించింది. ఈ టీజర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news