నాకు సెక్యూరిటీ అవసరం.. భద్రత పెంచాలి : డీకే అరుణ

-

నాకు సెక్యూరిటీ అవసరం.. భద్రత పెంచాలి అని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేసారు. నిన్న రాత్రి జూబ్లి హిల్స్ లోని నా నివాసంలోకి 3 గంటల ప్రాంతంలో అగంతకుడు చొరబడ్డాడు. గంటన్నర పాటు నా ఇంట్లో కలియ తిరిగాడు. కానీ ఎలాంటి వస్తువులు గానీ, డాక్యుమెంట్స్ గానీ దొంగిలించబడలేదు. అసలు దొంగ ఎందుకు వచ్చాడో తెలియడం లేదు అని ఎంపీ పేర్కొన్నారు.

అలాగే నా ఇంటికి 100 మీటర్ల దూరం లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంది. కాబట్టి ఈ విషయాలు అన్ని గుర్తుకుపెట్టుకోవాలి. నాకు సెక్యూరిటీ అవసరం. అందుకే సీఎం గారు నా భద్రత గురించి ఆలోచించాలి. నా కుటుంబ నేపథ్యం దృష్ట్యా నాకు.. నా భర్తకు సెక్యూరిటీ కల్పించాలి.. నాకు భద్రత పెంచాలి నా ఇంటి వద్ద సెక్యూరిటీ కల్పించాలి అని డిమాండ్ చేసారు ఎంపీ అరుణ. అయితే ఇంట్లో నుండి ఏం తీసుకెళ్లనప్పుడు అసలు దొంగ ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news