సురేఖ వాణి కుమార్తెతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అందరిపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సజ్జనార్. సన్నీ యాదవ్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. ఈజీ మనీ మాయలో జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు సజ్జనార్.

సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరింత సమాచారం సేకరించవచ్చు అని వెల్లడించారు.