ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పులివెందుల సమస్యలను అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ విఫలం అయ్యాడని… అసెంబ్లీ కి వెళ్ళని జగన్ ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లి లో త్రాగునీరు,అండర్గ్రౌండ్ డ్రైనేజీ,రోడ్ల పరిస్థితి నీ అసెంబ్లీ లో ప్రస్తావించాలన్నారు. మాజీ సిఎం గా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని వెల్లడించారు.

వేంపల్లి పంచాయితీ లో పనిచేసిన ఈఓ లు బాధ్యత రహితంగా వ్యవహరించారని… జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు రవి శంకర్ రెడ్డి 52 లక్షలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవం కాదా… అంటూ నిలదీశారు. తాజాగా సస్పెండ్ అయిన ఈఓ నాగసుబ్బరెడ్డి కోటి 88 లక్షలు మింగేశాడు…ప్రజలు కట్టిన పన్నును తమ అకౌంట్ల లో వేసుకొని ఆస్తులు పెంచుకున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానా ను దుర్వినియోగం చేశారు…ఏడాదిగా గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించకుండా వ్యవస్థను నాశనం చేశారని తెలిపారు. మూడు సమావేశాలకు హాజరుకకపోతే సర్పంచ్, వార్డు సభ్యులు సభ్యత్వం రద్దు అవ్వాలని తెలిపారు.