మామూలు రాజకీయాలని తలదన్నేలా సిని’మా’ రాజకీయం నడిచిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలని తలపించాయి. నటులు రాజకీయ నాయకుల మాదిరిగా మారిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే ఏం జరిగినా చివరికి ‘మా’ ఎన్నికలు ముగిశాయి…ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచి విష్ణు గెలిచారు. విష్ణు ‘మా’ కొత్త ప్రెసిడెంట్ అయ్యారు.
ఈ ‘మా’ ఎన్నికల్లో తెరవెనుక కులాల కుంపటి నడిచిందని క్లియర్ కట్‌గా తెలుస్తోంది. మామూలుగానే సినీ ఇండస్ట్రీలో కమ్మ వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి ఎంట్రీ తర్వాత పరిస్తితి మారింది. ఇండస్ట్రీలో కాపుల హవా కూడా మొదలైంది. తాజాగా జరిగిన ‘మా’ ఎన్నికలు కమ్మ వర్సెస్ కాపు అన్నట్లుగానే నడిచాయట. చిరంజీవి సపోర్ట్‌తోనే ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు బరిలో దిగారు.
చిరు…కాపు కులానికి చెందిన వ్యక్తి అని, మోహన్ బాబు…కమ్మ కులానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. దీంతో ‘మా’ ఎన్నికలు పూర్తిగా వర్గాల మధ్య పోటీగా మారిపోయిందని తెలుస్తోంది. కమ్మ వర్గం వారంతా మంచు విష్ణుకు, కాపు వర్గమంతా ప్రకాశ్ రాజ్‌కు మద్ధతుగా నిలిచారు. అయితే కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉండటంతో మంచు విష్ణు విజయం సులువైంది. పైగా ఏపీ సిఎం జగన్ ఎలాగో మంచు విష్ణుకు బంధువు…దీంతో రెడ్డి వర్గం మద్ధతు కూడా విష్ణుకే వచ్చింది. ఎలాగో సినిమా టిక్కెట్ల విషయంలో పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లు వార్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విష్ణుకు మరింత మద్ధతు పెరిగింది. మొత్తానికి ఇలా కులాల కుంపటి తెరవెనుక నడవటంతోనే ‘మా’ ఎన్నికలు హోరాహోరీగా నడిచాయి. మొత్తానికి ఈ పోరులో కమ్మ వర్గానికి చెందిన మంచు విష్ణు పైచేయి సాధించారు.