సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రేమ, పెళ్లి, సహజీవనం చాలా తేలికగా మారిపోయాయి. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే పెళ్లి కాకుండానే తల్లిగా మారారు.
స్టార్ హీరోయిన్లు సైతం తాము మంచి స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోకుండా తల్లిగా మారినట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. మరికొందరు పరిస్థితులు బట్టి పెళ్లి కాకుండా తలయ్యారు.. అయితే ఇలా ఉన్న మన హీరోయిన్స్ ఎవరంటే..
సారిక.. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న సారిక పెళ్లి కాకముందే తల్లిని అయ్యాను అంటూ ప్రకటించి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి విశ్వ నటుడు కమల్ హాసన్ అంటూ చెప్పి అందరిని షాక్కు గురి చేసి వైరల్ గా మారారు. ఆ తర్వాత కొన్ని రోజులకే శృతిహాసన్ జన్మించింది. అనంతరం రెండో కూతురు అక్షరాహాసన్ పుట్టిన తర్వాత కమల్ హాసన్ సారిక వివాహం చేసుకున్నారు.
శ్రీదేవి.. అతిలోక సుందరి శ్రీదేవి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ శ్రీదేవి ప్రేమించుకోగా వీరిద్దరు ప్రేమకి బోనీకపూర్ మొదటి భార్య ఒప్పుకోదని సందేహంతో శ్రీదేవి పెళ్లికి ముందే తల్లిగా మారినట్టు సమాచారం. జాన్వి కడుపులో ఉంటుండగానే బోనీకపూర్ శ్రీదేవి పెళ్లి చేసుకోగా ఆ తర్వాత కొన్ని రోజులకి జాన్వి జన్మించింది.
రేణు దేశాయ్.. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రి సినిమాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య అప్పటికి విడాకులు ఇవ్వని కారణంగా కొన్నాళ్లపాటు వీరిద్దరూ కలిసి ఉన్నారు. అనంతరం పెళ్లికి ముందే అకిరా నందన్ జన్మించగా ఆ తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాక ఆద్య జన్మించింది
అలియా భట్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కొన్నాళ్లుగా రన్బీర్ కపూర్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన రెండు నెలలకే తను తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించిన ఆలియా కొన్ని నెలలకే పాపకు జన్మనిచ్చింది. అంతేకాకుండా పెళ్లి కాకుండానే తల్లినయ్యా అంటూ ఒప్పుకుంది..
ఇలియానా.. గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన నడుము అందాలతో అలరించిన ఈ భామ కొన్నాళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని అతనితో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకులు తీసుకున్న ఈ భామ తాజాగా తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.