ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రెండు పార్టీలు తమదైన శైలిలో రాజకీయం చేస్తూ, వ్యూహాలు పన్నుతూ ఒకరినొకరు చెక్ పెట్టుకోవడానికి చూస్తున్నారు. అయితే మొన్నటివరకు అధికారంలో ఉన్న వైసీపీ హవా నడిచింది. ఎక్కడకక్కడ టిడిపికి వైసీపీ చెక్ పెడుతూ వచ్చింది.
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సీన్ మారింది..ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలిచిందో..కాస్త ప్రజా మద్ధతు టిడిపికి పెరిగిందని అర్ధమైందో అప్పటినుంచి సీన్ రివర్స్ అయింది. వైసీపీకి ధీటుగా టిడిపి రాజకీయం చేస్తుంది. ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలు, సభలతో ప్రజల్లో ఉంటున్నారు. ఇటు లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. దీంతో టిడిపికి అనూహ్యంగా ప్రజా మద్ధతు పెరుగుతుంది. అదే సమయంలో ఇప్పటివరకు జగన్ వేసిన వ్యూహాలకు చంద్రబాబు, లోకేష్ చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ రాజకీయంగా లబ్ది పొందడానికి వేసిన మూడు రాజధానుల వ్యూహం వికటిస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా పోయిందని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటు ఉత్తరాంధ్రలో, అటు రాయలసీమలో వైసీపీకి నష్టం తప్ప లాభం లేదు.
ఇక కర్నూలులో హైకోర్టు పెడతానని జగన్ హామీ ఇచ్చి నాలుగేళ్ళు దాటింది..అయినా సరే అక్కడ దిక్కు మొక్కు లేదు. దీంతో జగన్ అబద్దం చెప్పారని, హైకోర్టు రావడం కష్టమని, కానీ టిడిపి అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేష్..రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే హైకోర్టు ఏర్పాటు చేయడం కష్టమే గాని, బెంచ్ ఏర్పాటు చేయడం సులువే. దీంతో లోకేష్ హామీని ప్రజలు నమ్ముతున్నారు. దీని వల్ల టిడిపికి పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.