కూతుళ్లతో తమ అనుబంధాన్ని తెలిపిన సెలెబ్రెటీలు..!

-

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలను కొంతమంది భారంగా భావిస్తున్నారు. కానీ ఆడపిల్ల పిల్ల లేకుంటే ఈ లోకంమే లేదు. ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఇక ఆడ‌పిల్ల లేని ఇల్లు, చంద‌మామ లేని ఆకాశం రెండు ఒక్క‌టే అని అన్నారు పెద్దలు. అందుకే ప్ర‌తి ఇంట్లో వెన్నెల‌లాంటి ఆడ‌పిల్ల ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఆడబిడ్డల గొప్పదనాన్ని గుర్తు చేసుకునేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

shilpa-ajya

దేశవ్యాప్తంగా ఆదివారం నాడు డాటర్స్ డే జరుపుకున్నారు. కూతుర్లపై ప్రేమానురాగాలను తమదైన శైలిలో విషెస్ చెబుతున్నారు ప్రముఖులు అంత. ఇక ఆదివారం అంత‌ర్జాతీయ కూతుర్ల దినోత్సవం సంద‌ర్భంగా సామాన్యులు, సెల‌బ్రిటీలు త‌మ కూతుర్ల‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. అక్ష‌య్ కుమార్, కాజోల్‌, శిల్పా శెట్టి, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ ఇలా చాలా మంది సెల‌బ్రిటీలు కూతుర్ల‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. వ‌ర‌ల్డ్ డాట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు. ఈ ఫొటోస్ చుసిన వారంతా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version