వెండితెరపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. రిలీజ్ డేట్​ ఫిక్స్

-

భారతీయ చలన చిత్ర రంగంలో కొంత కాలం బయోపిక్​ల ట్రెండ్ నడిచింది. ఇప్పుడు మాత్రం మైథాలజీ, చారిత్రక నేపథ్యాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే ట్రెండ్ నడుస్తోంది. అయితే కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి బయోపిక్​ ట్రెండ్ మొదలైంది. తాజాగా శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ‘800’.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. మరో బయోపిక్​ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ బయోపిక్ ఎవరిదంటే..?

భారత రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జీవితం వెండితెరపై రానుంది. ‘గడ్కరీ’ పేరుతో రూపొందిన ఈ బయోపిక్‌ అక్టోబరు 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్‌ గడ్కరీ పాత్ర పోషించిన నటుడి వివరాలను వెల్లడించకుండా సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది చిత్ర బృందం. విడుదల చేసిన పోస్టర్‌లో ప్రధాన పాత్రధారి లుక్‌ ఉన్నా అది వెనకకు తిరిగి ఉండటంతో గడ్కరీలా నటించేది ఎవరనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

విడుదలకు 21 రోజుల సమయమే ఉన్నా హీరో ఎవరో చెప్పకపోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లోనైనా ఆ డిటైల్స్‌ రివీల్‌ చేస్తారా? లేదా నేరుగా తెరపైనే ఆ హీరోని పరిచయం చేస్తారా? అంటే వేచి చూడాల్సిందే. ఈ బయోపిక్‌కు అనురాగ్‌ రాజన్‌ భూసరి దర్శకత్వం వహించారు. అక్షయ్‌ అనంత్‌ దేఖ్‌ముఖ్‌ నిర్మాతగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version