సమంతతో విడాకుల తర్వాత మళ్లీ అలాంటి కామెంట్స్ చేసిన చైతూ..!

-

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం కస్టడీ.. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ టైం దగ్గర పడుతున్నందున సినిమా ప్రమోషన్స్ శరవేగంగా చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ పాడ్ కాస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు నాగచైతన్య. ఈ సందర్భంగా డేర్ అండ్ ట్రూత్ సెగ్మెంట్లో ఇంటర్వ్యూయర్ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతిపెద్ద పశ్చాతాపం ఏంటి అని అడగగా.. దీనికి నాగ చైతన్య స్పందిస్తూ.. నా జీవితంలో అలాంటిది ఏం లేదు అని బదులిచ్చారు ..ఇక ప్రతిదీ ఒక పాఠమేనని తెలిపారు.

అయితే అక్కడితో ఆగకుండా వెంటనే విడాకుల తర్వాత ఏదైనా బాధపడ్డ ఘటన , సినిమాల పరంగా నైనా ఉందా అని మళ్లీ ప్రశ్నించగా .. దీనికి నాగ చైతన్య చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా మారింది. నాగ చైతన్య మాట్లాడుతూ.. సినిమాల పరంగా చాలా బాధపడ్డ ఘటనలు ఉన్నాయి. రెండు మూడు చిత్రాల విషయంలో మాత్రం చాలా రిగ్రీట్ గా ఫీల్ అయ్యాను.అంటూ తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి . ఇకపోతే నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత తమ తమ జీవితాలలో బిజీ అయ్యారు కెరియర్ పైనే ఫోకస్ పెట్టారు.

అయితే నాగచైతన్య మాత్రం గత ఆరు నెలలుగా ప్రముఖ హీరోయిన్ శోభితతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వీరు మాత్రం పలు ప్రదేశాల్లో తిరిగిన ఫోటోలు కెమెరా కంటపడడంతో నిజమేనా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య తన లేటెస్ట్ ఫిలిం కస్టడీతో మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version