షాకింగ్ ఘటన.. అక్కడ తొమ్మిదేళ్లకే అమ్మాయిలకు పెళ్లి..!

-

సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట. మన భారతదేశంలో అయితే యువతికి 21 సంవత్సరాలు, యువకుడికి 25 సంవత్సరాలు నిండాలి. అది కరెక్ట్ వయస్సు అంటారు. ప్రభుత్వం ప్రకారం.. 18 ఏళ్లు మహిళకు, 21 సంవత్సరాలు పురుషుడికి నిండి ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చు. అయితే అంతకు తక్కువ ఏజ్ ఉన్న వారిని పెల్లి చేసుకుంటే బాల్య వివాహ చట్టం కింద అరెస్టులు చేస్తారు. కానీ ఓ దేశంలో ఏకంగా తొమ్మిదేళ్లకే పెళ్లి అనేవిధంగా చట్టాన్ని తీసుకురావడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తొమ్మిదేళ్ల వయస్సులోనే బాలికలను పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించేవిధంగా ఇరాక్ వివాహ చట్టానికి చట్టపరమైన సవరణలు ఆమోదించనున్నట్టు సమాచారం. దీనిని 188 చట్టం అని కూడా పిలుస్తారు. 1959లో ప్రవేశపెట్టారు. దాదాపు ఇరాక్ లో 28 శాతం అమ్మాయిలు 18 సంవత్సరాలలోపు పెల్లి చేసుకున్న వారే ఉండటం గమనార్హం. ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలవుతున్న ఇరాక్ పాలకులు మరో వివాదస్పద బిల్ పాస్ చేశారు. గతంలో 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల కనీవ వివాహ వయస్సు 9 సంవత్సరాలకు మారనుంది. జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం.. 9 ఏళ్ల బాలికకు పెళ్లి చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version