Chandra Bose : ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ మాట్లాడుతూ….మహాకవి గురజాడ విశిష్ట పురష్కారం అందుకోవడం పూర్వ జన్మ సుకృతం అన్నారు.
గురజాడ స్వగృహ సందర్శన దైవ క్షేత్రముతో సమానంగా భావిస్తున్నా….విజయనగరం నేలపై గురజాడ ఇంటిలో అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగిందని వెల్లడించారు. మహనీయుడు పేరున ఇస్తున్న అవార్డు నాకు దక్కడం గర్వంగా భావిస్తున్నా… ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత “చంద్రబోస్” కి గురజాడ విశిష్ట పురష్కారం తో సత్కారం అని వెల్లడించారు. ఈ సత్కారం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గ ప్రసాద్ రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సభలో తను రాసిన మౌనంగానే ఏదగమని మొక్క నీకు చెబుతుంది అనే పాటను పాడి అందరినీ అలరించారు చంద్రబోస్.