సీఎం కేసీఆర్ జీవితంలోనే ఘోర పరాభవం ఎదురయింది. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. కానీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మరియు తెలంగాణను సాధించిన వ్యక్తిగా గుర్తింపు… రెండుసార్లు సీఎం గా చేసిన సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం అందరిని షాక్ నకు గురి చేసింది.
ఇది ఆయన జీవితంలో అతిపెద్ద అవమానం గా భావించవచ్చు. సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక్కసారి ఓడిపోయారు. అది కూడా సిద్దిపేట నియోజకవర్గంలో మదన్మోహన్ చేతిలో సీఎం కేసీఆర్ ఓడిపోయారు. దాదాపు 30 సంవత్సరాలు తర్వాత మళ్లీ సీఎం కేసీఆర్ కామారెడ్డి లో ఓడిపోవడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేయక అక్కడ అఖండ విజయం సాధించారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ నగరంలోని ఎల్లా హోటల్ వేదికగా… ఇవాళ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయ్యే ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.