జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ అలాగే రక్షిత వివాహ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జూన్ రెండవ తేదీ ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా.. నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు.. ఇక ఈ కార్యక్రమానికి.. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా హాజరయ్యారు. మరొకవైపు శర్వానంద్ చిన్నప్పటి నుంచి స్నేహితుడైన రామ్ చరణ్ కూడా వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక రామ్ చరణ్ నిన్న సాయంత్రం జైపూర్ వెళ్లి అక్కడ శర్వానంద్ పెళ్లి , సంగీత్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
శర్వానంద్ తో పాటు పలువురు బంధువులు, టాలీవుడ్ పాటలకు డాన్సులు వేసి నానా హంగామా చేశారు. ఇక చరణ్ ఫోటోలు , శర్వానంద్ సంగీత్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి ఒక రోజు ముందే హాజరై హడావిడి చేస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక్కడ కూడా ఆయన ఎంతో సింపుల్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇక శర్వానంద్ విషయానికి వస్తే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన ఈయన ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు . ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఎటువంటి ప్రకటన లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సడన్ సర్ప్రైజ్ చేశాడు.మాజీ మంత్రి అయిన టిడిపి నేత స్వర్గీయ బొజ్జల రామకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురు రక్షితను శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా హైదరాబాద్ లోనే పనిచేస్తుంది. ఇక ఈ జంట ఇప్పుడు మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఒక్కటి కాబోతున్నారు.
#RamCharan – #Vicky – #Sharwa ❤️🔥❤️🔥❤️🔥
It’s @AlwaysRamCharan‘s Best Friend’s Wedding Times. @ImSharwanand Sangeet in Jaipir ❤️#GameChangerpic.twitter.com/abnBqQN60h
— Trends RamCharan™ (@TweetRamCharan) June 2, 2023