లైగర్ మూవీ వివాదంపై స్పందించిన చార్మి

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా గతేడాది ఆగస్టు 25న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై 9 నెలలు దాటిన పూరీ జగన్నాథ్ ని మాత్రం ఈ సినిమా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

 

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో నష్టాలను మిగిల్చింది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. ఫిలిం ఛాంబర్ ఎదుట లైగర్ బాధితులు రిలే దీక్షకు పూనుకున్నారు. లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే మూవీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఆందోళనతో నిర్మాత చార్మి దిగొచ్చింది. దీనిపై ఫిలిం ఛాంబర్ కు ఓ మెయిల్ పంపించింది. వారి సమస్య తమ దృష్టిలో ఉందని పేర్కొంది. అంతేకాదు వారందరికీ త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. మరి చార్మి హామీతో వారు ఆందోళన విరమిస్తారో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version