వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సిబిఐ కీలక నిర్ణయం

-

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖకు నిన్ హైడ్రేట్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ.

అయితే దీనిపై నిందితుల అభిప్రాయాలు తెలపాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై జూన్ 2వ తేదీన సిబిఐ కోర్టు విచారణ జరపనుంది. వైయస్ వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖను ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సిబిఐ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వెల్లడించింది. లేఖలోని చేతిరాతను విశ్లేషిస్తే.. రాసినప్పుడు పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదని రిపోర్ట్ లో తేలిందని సిబిఐ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version