వైరల్ గా మారుతున్న చిరంజీవి కూతురు శ్రీజ కామెంట్స్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎంతటి ప్రేక్షక ఆధారన ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చిరంజీవి కూతురు శ్రీజ కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇక శ్రీజ గురించి ఈ మధ్యకాలంలో పలు రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి మెగా కుటుంబం కానీ, శ్రీజ కానీ ఎప్పుడు స్పందించలేదు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీజ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.ఇప్పుడు అందుకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

శ్రీజ మాట్లాడుతూ.. తన పిల్లలు తన మాట విని తన చెప్పిన దారిలోనే వెళ్లాల్సిన అవసరం లేదని.. పిల్లలు కేవలం క్రమశిక్షణతో పెంచుతానని తెలియజేసింది. తప్పు ఒప్పుల గురించి పలు విషయాలను కూడా ఏమాత్రం సందేహ పడకుండా చెబుతానని శ్రీజ తెలియజేసింది. ఇక తన చిన్న పాప నవిష్క బాగా అల్లరి చేస్తుందని తెలియజేయడం జరిగింది. నివృతి మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది అని అల్లరి చేయమన్న చేయదని తెలియజేస్తోంది శ్రీజ. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులు చేయవద్దని మాత్రమే తను సలహా ఇస్తానని తెలియజేస్తోంది.

పిల్లలు గారాబం ఎక్కువగా చేస్తే చెడిపోతారని అందుచేతనే తాను కూడా అప్పుడప్పుడు పిల్లలకు సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటానని తెలియజేస్తోంది. గారాబం ఎక్కువగా చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా పిల్లల ఎదుగుదలకు అడ్డం అవుతుందని తెలియజేస్తోంది శ్రీజ. ఇక తన తండ్రి తనను గారాబంగా పెంచినప్పటికీ పెద్దలను గౌరవించి క్రమశిక్షణతో మెలగాలని నేర్పించారని శ్రీజ తెలియజేసింది. తన తండ్రి ఎప్పుడూ కూడా కుటుంబ విలువల గురించి తెలియజేసే వాళ్ళని తెలియజేసింది. తన తండ్రి తనకి బాగా క్లోజ్ అని, తనకు ఎలాంటి సమస్య ఉన్న సరే తన తల్లిదండ్రులే చూసుకుంటారని తెలియజేస్తుంది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ తెలియజేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version